Hot Posts

6/recent/ticker-posts

పందులు విచ్చలవిడిగా సంచరించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్


ఏలూరు:  ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనావాసాలలో పందులు విచ్చలవిడిగా సంచరించకుండా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం పందుల బెడద నియంత్రణ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.


ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ హై కోర్ట్ ఆదేశాలు, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రజారోగ్యానికి ఎటువంటి భంగం కలగకుండా పందుల పెంపకాన్ని జనావాసాల నుండి ఊరి చివర మార్పు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  పందుల పెంపకంనకు ఊరి చివర పశువుల షెడ్లు ఏర్పాటుచేయాలని, పెంపకందార్ల పునరావాసానికి కు ప్రభుత్వ పధకాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  పందుల పెంపకందార్లతో సమావేశం ఏర్పాటుచేసి పారిశుద్ధ్యం, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనావాసాలలో పందుల సంచారం లేకుండా ఊరిచివర పందుల పెంపకం చేపట్టేలా వారికి అవగాహన కలిగించాలని,   వారి సమస్యలు తెలుసుకుని, నిబంధనల మేరకు వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.   

ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ ఏలూరు నగరంలోని పోణంగి కంపోస్ట్ యార్డు వద్ద పందుల పెంపకంనకు  కొంత స్థలమును గుర్తించడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. మాలిని, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎం. ముక్కంటి, ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు,   ఏలూరు జిలాల్లోని పురపాలక సంఘాల కమిషనర్లు, పశుసంవర్ధక శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.