Hot Posts

6/recent/ticker-posts

భారీ వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం


ANDRAPRADESH, AMRAVATHI: రాష్ట్రవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే భారీగా ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని స్పష్టం చేసింది. ఆ క్రమంలో గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలపై రాష్ట్రంలోని పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. తగిన విధంగా సూచనలు జారీ చేసినట్లు చెప్పింది.


ఇక.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, కురిసే అవకాశం ఉందన్న పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.

మరోవైపు.. జూన్ 1వ తేదీన రావల్సిన నైరుతి ఋతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అసలు అయితే మే 25 తారీఖు నుంచి రోహిణి కార్తి.. దీంతో ఎండలు విపరీతంగా కాయాల్సి ఉంది. కానీ ముందుగానే నైరుతి బుతుపవనాలు ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.