ANDRAPRADESH, KADAPA: టీడీపీ మహానాడు వేదికగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రెండో రోజు మహానాడులో భాగంగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు మరో సారి ఎన్నిక కానున్నారు. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేత లు మహానాడు వేదికగా కొత్త డిమాండ్ చంద్రబాబు ముందు ఉంచారు. నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని సీనియర్లు ప్రతిపాదించారు. ఇక, ఇప్పుడు మహా నాడు వేదికగా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
లోకేష్ కు ప్రమోషన్
మంత్రి లోకేష్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే దిశగా కసరత్తు సాగుతోంది. కొంత కాలంగా లోకేష్ కు పార్టీలో .. ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. అందులో భాగంగా పార్టీ మహానాడు వేదికగా పార్టీ సీనియర్లు తమ మనసులో మాట బయట పెట్టారు. చంద్రబాబు వద్ద లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కేటాయించాలని ప్రతిపాదించారు. మహానాడు వేది కగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ప్రతిపాదించారు. నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని తాము మినీ మహానాడులో తీర్మానించామనివెల్లడించారు. పార్టీలోని వారంతా కోరుకుంటున్న విధంగా నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు ధూళిపాళ నరేంద్ర విజ్ఞప్తి చేశారు.
సీనియర్ల డిమాండ్
ఇప్పటికే మంత్రి నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని తెలుగుదేశం పార్టీలో పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ నేతల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు పలువురు నేతలు ఇదే విషయాన్ని బుధవారం మహానాడు వేదికగా స్పష్టం చేశారు. ఈ రోజు పార్టీ జాతీయ అధ్యక్ష్యుడిగా మరోసారి సీఎం చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆ క్రమంలో నారా లోకేశ్‌ను సైతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. గత ప్రభుత్వం పాలనలో పెట్టుబడి దారులు రాష్ట్రం నుంచి పారిపోయారని చెప్పుకొచ్చారు. ఇదే వేదిక నుంచి చంద్రబాబు కీలక ప్రసంగం చేసారు. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత తమదే అని చంద్రబాబు వెల్లడించారు. 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తలే కారణమని చెప్పుకొచ్చారు.
కార్యకర్తే అధినేత
కార్యకర్తలే సుప్రీం అనేది పార్టీ సిద్దాంతంగా చంద్రబాబు పేర్కొన్నారు. 2047కు తెలుగుజాతిని ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంచాలనేది లక్ష్యంగా వెల్లడించారు. రాబోయే 40 ఏళ్లకు రోడ్ మ్యాప్‌నకు రూపకల్పన చేసుకున్నామని వివరించారు. తెలుగు కుటుంబం కోసం ఆరు శాసనాలు చేసుకున్నామని చెప్పారు. 45 రోజుల్లో కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు. తొలిసారి అసెంబ్లీకి 65 మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీదని వెల్లడించారు. నీతి నిజాయతీ, పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలుగా వ్యవహరించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని సీఎం చంద్రబాబు వివరించారు. సాయంత్రం మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ వీకారం ఉండనుంది.
Social Plugin