Hot Posts

6/recent/ticker-posts

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం

మొదటి రోజు కార్తీక మాస మహోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్.

ఎమ్మెల్యే తో పాటు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు.

ఏలూరు జిల్లా

జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో బుధవారం కార్తీక మాస మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. దీంతో ఆలయ పూజారులు చింతలపూడి ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక మాస మహోత్సవాలను ప్రారంభించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకోని, అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్టోబర్ 22వ తారీకు నుంచి నవంబర్ 20వ తారీకు వరకు జరిగే కార్తీక మహోత్సవాలు శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో విజయవంతంగా జరగాలని అన్నారు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి తొక్కేసిలాటలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు.

 భక్తులకు ప్రతిరోజు త్రాగడానికి ఏర్పాటు చేసే మంచినీటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షణ చేయాలని మహోత్సవాలు జరిగిన అన్ని రోజులు ఎంపీడీవో పర్యవేక్షణలో శానిటేషన్ తోపాటు ప్రతిరోజు బ్లీచింగ్ ఉపయోగించాలని విద్యుత్ సమస్య లేకుండా ఎలక్ట్రికల్ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని అన్నారు.

 అలాగే దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎటువంటి ట్రాఫిక్కు ఇబ్బందు కలగకుండా జంగారెడ్డిగూడెం డిఎస్పి పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు, జిల్లా నాయకులు మండల నాయకులు ఆలయ అధికారులు మండల అధికారులు కూటమి నాయకుడు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.