కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు
పెద్దాపురం డిఎస్పి హరి రాజు పర్యవేక్షణలో..
ప్రతిపాడు సీఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో..
ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద, బీచ్ ల వద్ద ఆగివున్న పార్క్ చేసిన కార్ల నుండి దొంగతనాలు చేసే నేరస్తుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
1కేజీ బంగారం స్వాధీనం
ఈ సందర్భంగా కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ..
ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావుకు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు..కోనసీమ జిల్లాకు చెందిన గణేష్ (47)అనే వ్యక్తిని పట్టుకొని విచారించిగా..
సులభమైన పద్ధతులలో అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలు వద్ద, సముద్ర తీరాలలో నిలిపి ఉంచిన కార్లు నుండి బంగారు వస్తువులను దొంగతనం చేసినట్లుగా అంగీకరించగా...సదరు వ్యక్తి నుండి ఐదు కేసులు ( అన్నవరం 2 కేసులు, తిమ్మాపురం 2 కేసులు , ద్వారకాతిరుమల 1 కేసు) సంబంధించిన 965 గ్రాముల బంగారం వస్తువులను స్వాధీన పరుచుకుని, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు.
Social Plugin