Hot Posts

6/recent/ticker-posts

అలా కుదరదంటే డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. ఏపీలో వారందరికీ నోటీసులు.!


ఏపీలో వారందరికీ బ్యాడ్ న్యూస్.. డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఏపీ గృహ నిర్మాణ సంస్థ నోటీసులు జారీ చేస్తోంది. ఇంటి పట్టాలు పొందిన తర్వాత అందులో ఇంటి నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం లబ్ధిదారులకు అడ్వాన్సులు కూడా అందించింది.

 అయితే అడ్వాన్స్ పొందిన తర్వాత కూడా కొంతమంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి ఏపీ గృహ నిర్మాణ సంస్థ నోటీసులు జారీ చేస్తోంది. ఇంటి పనులు ప్రారంభించాలని.. కుదరకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని నోటీసులు ఇస్తోంది

మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఎస్సీ, బీసీ సామాజికవర్గాల లబ్ధిదారులకు అదనపు సాయం రూపంలో రూ.50 వేలు చెల్లిస్తోంది. అలాగే ఎస్టీ సామాజికవర్గాల వారికి రూ.75 వేలు చొప్పున అందిస్తున్నారు. 

ఈ సాయం పొందిన తర్వాత కొంతమంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించగా.. మరికొందరు మాత్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో అలాంటి వారిలో కదలిక తెచ్చేందుకు.. అలాంటి వారికి ఏపీ గృహ నిర్మాణ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. 

ఇంటి నిర్మాణం ప్రారంభించాలని.. అలా వీలు కాకపోతే ప్రభుత్వం అందించిన అడ్వాన్స్ తిరిగి చెల్లించాలని నోటీసులు ఇస్తున్న పరిస్థితి.

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇంటి నిర్మాణాలు ప్రారంభించి.. ఆ తర్వాత వాటిని నిలిపివేసిన కుటుంబాలకు.. తిరిగి ఇల్లు కట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం అడ్వాన్సులు అందించింది. 

కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అలాంటి వారికి అడ్వాన్సులు అందించారు. అయినప్పటికీ కొంతమంది పనులు ప్రారంభించకపోవటంతో ఏపీ గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

పేదలకు పక్కా ఇళ్లు ఉండాలనేది ప్రభుత్వం ఉద్దేశమన్న గృహ నిర్మాణ సంస్థ అధికారులు.. అడ్వాన్సులు తీసుకున్న తర్వాత కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టని వారికి నోటీసులు ఇస్తున్నామన్నారు.

 నోటీసులు అందజేసి పనులు చేపట్టాలని సూచిస్తున్నట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులు చెప్తున్నారు. ఒక వేళ.. అప్పటికీ ఇంటి నిర్మాణానికి ముందుకు రాకపోతే అలాంటి వారి నుంచి అడ్వాన్స్ నగదు రికవరీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.