తెలంగాణలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపురం వద్ద భారీ ప్రమాదం జరిగింది.
HYDERABAD:మరణం అనేది ఎవరికి ఎప్పుడు, ఎక్కడ రాసిపెట్టి ఉంటుందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన ఇద్దరు అత్యున్నత ఆఫీసర్లను మరో రాష్ట్రంలో ప్రాణాలు విడిచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీస్ శాఖలో తీవ్ర విషాధం నెలకొంది. మొదలు వారు పోలీసులని ఎవరికీ తెలియదు.. కానీ వారి ఐడెంటిటీ కార్డులు చూసిన తర్వాత తెలిసింది. దీంతో తెలంగాణ పోలీసులు కూడా కంట తడిపెట్టారు.
తెలంగాణలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపురం వద్ద భారీ ప్రమాదం జరిగింది. ఇద్దరు డీఎస్పీలు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీ కొంది. కొంచెం దూరం పడి ఆగిన కారును హైదరాబాద్ నుంచి వేగంగా వస్తున్న లారీ మరోసారి ఢీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఇంత భారీ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు శాంతారావు, ఛక్రధర్ మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మొదట డీఎస్పీలను ఎవరూ గుర్తించలేదు. కానీ వారి ఐడెంటిటీ కార్డులు చూసిన తర్వాతనే గుర్తించారు. వారిద్దరూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన డీఎస్పీలు అని తెలిసింది. ఈ ప్రమాద విషయాలను తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాధం సంభవించింది. ఇద్దరు డీఎస్పీలు ఆఫీస్ పనిపై వెళ్తున్నారా? లేక వ్యక్తిగత పనిపై వెళ్తున్నారా? తెలియాల్సి ఉంది. అటు పోలీస్ శాఖలో, ఇటు వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Social Plugin