INDIA:ఓ వైపు స్పృహా కోల్పోయి ప్రాణాలతో కొట్టామిట్టాడుతున్న ఆ యువతిని కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ మృగాలు చుట్టుముట్టాయి. ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని కదులుతున్న అంబెలెన్స్ లోనే తమ కామ వాంఛ తీర్చుకున్నారు. సభ్య సమాజం తల దించుకునే ఇలాంటి ఘటన బిహార్ లో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటన జులై 24 జరిగింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృగాల కంటే ఘోరంగా వ్యవహరించారు వాళ్లు. అయ్యో పాపం అని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి కదులుతున్న అంబులెన్స్ లోనే తమ కామ వాంఛ తీర్చుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 26 ఏళ్ల యువతి బిహార్ లోని గయాలో జిల్లాలోని బిహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించిన హోమ్ గార్డ్ రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరైంది. అయితే అధికారులు ఆమెకు ఫిజికల్ టెస్టు నిర్వహిస్తుండగా ఆ యువతి కళ్లు తిరిగి కింద పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్సును ఏర్పాటు చేశారు. అప్పటికే స్పృహ కోల్పోయిన ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
Social Plugin