Hot Posts

6/recent/ticker-posts

సాయిరెడ్డి మరో బిగ్ ట్విస్ట్..! కాంగ్రెస్ అధ్యక్షుడికి సంకేతం..!


HYDERABAD:ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత మాత్రం మనసు మార్చుకున్నారు. వైసీపీకీ, ఎంపీ పదవికీ, రాజకీయాలకూ ఒకేసారి గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ఉన్నట్లుండి ఏపీ మద్యం స్కాంలో సాక్షిగా వెళ్లి విచారణకు సహకరించి వచ్చారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కు తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది.

ఇలా ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు ఇస్తున్న విజయసాయిరెడ్డి.. ఇవాళ మరో ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతెత్తున లేచే సాయిరెడ్డి.. ఇవాళ మాత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేకు ఓ ట్వీట్ పెట్టారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలపై విమర్శలకే పరిమితమైన సాయిరెడ్డి.. ఇవాళ మాత్రం అనూహ్యంగా ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.

దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, దేశానికి నిరంతర సేవ చేయాలని కోరుకుంటున్నానని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.