మరోవైపు... త్వరలో బిగ్ బాస్ అరెస్ట్.. అంతా బిగ్ బాస్ కనుసన్నల్లోనే.. అంతిమ లబ్దిదారు బిగ్ బాస్ అంటూ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కథనాల్లో శీర్షికలు దర్శనమిస్తున్నాయి.
ANDHRAPRADESH:ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన వేళ.. పెద్ద తిమింగలం, బిగ్ బాస్ వంటి పదాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఈ విషయంపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర... లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకూ అరెస్టైనవి చిన్న చిన్న తిమింగలాలని.. త్వరలో పెద్ద తిమింగలం అరెస్ట్ అవ్వబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో... ఈ స్టేట్ మెంట్ వైరల్ గా మరింది.
మరోవైపు... త్వరలో బిగ్ బాస్ అరెస్ట్.. అంతా బిగ్ బాస్ కనుసన్నల్లోనే.. అంతిమ లబ్దిదారు బిగ్ బాస్ అంటూ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కథనాల్లో శీర్షికలు దర్శనమిస్తున్నాయి. ఈ సమయంలో... తాజాగా బిగ్ బాస్ అంటే జగనే అంటూ ఓ పత్రికలో కథనం అచ్చైంది! దీంతో వైసీపీ నేతలు వాయిస్ పెంచారు. అసలు ఏపీలో బిగ్ బాస్ ఒక్కరే ఉన్నారని.. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా స్పందించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్... ఏపీలో దేనికి ఎవరు బిగ్ బాసో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... ప్రజలకు మంచి చేయడం, ఇచ్చిన హామీలన్నీంటినీ నెరవేర్చడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ బిగ్ బాస్ అయితే.. వెన్ను పోటు పొడవడం, స్కాంలు చేయడంలో చంద్రబాబు బిగ్ బాస్ అంటూ మొదలుపెట్టారు.
ఇదే సమయంలో... ప్రచారం కోసం ప్రాణాలను తీయడం, ఓటుకు కోట్లు కేసులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనడం వరకూ చంద్రబాబును మించిన బిగ్ బాస్ ఎవరూ లేరని అమర్నాథ్ అన్నారు. హైదరాబాద్ లోని ఐఎంజీ భూములు కేసుల నుంచి స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్ ఎలైన్ మెంట్ లోనూ, రాజకీయ కుట్రల్లోనూ బిగ్ బాస్ చంద్రబాబే అని అంతా చెబుతారని తెలిపారు.
ఈ సందర్భంగా... మద్యం కేసులో జగన్ పై పసుపు పత్రికలు పదేపదే తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడిన అమర్నాథ్... అసలు ఈ కేసును సిట్ విచారిస్తుందో.. లేక, టీడీపీ అనుకూల మీడియా విచారిస్తుందో తెలియడం లేదని అన్నారు. రిమాండ్ రిపోర్ట్ ఎలా ఉండాలో కూడా ఆ మీడియానే సూచిస్తుందని మండిపడ్డారు!
ఇక... మద్యం కుంభకోణంలో తొలుత రూ.లక్ష కోట్లు అని, ఇప్పుడు రూ.3,500 కోట్లు అని అంటున్నారని.. అదేవిధంగా, ఒకసారి మద్యం డబ్బుతో ఆఫ్రికాలో పెట్టుబడులు అని, మరోసారి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చుచేశారంటూ కథనాలు వండి వారుస్తున్నారని అన్న్నారు. ఏది ఏమైనా... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బిగ్ బాస్ అనే పదం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
Social Plugin