Hot Posts

6/recent/ticker-posts

హోటల్స్ లో బిర్యానీలు తెగ తింటున్నారా? అయితే ఇది మీ కోసమే!


HYDERABAD:హోటళ్ళు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లలో బిర్యానీలు తింటున్నారా? అయితే మీరు ఒక్క నిమిషం ఆగాల్సిందే.. మీరు తింటున్న బిర్యాని మంచిదేనా? అది ఎటువంటి కల్తీ లేని మంచి వనస్పతి తో, నూనెతో తయారు చేసిందేనా? అనేది ప్రస్తుతం ఆలోచించాల్సిన పరిస్థితి. సహజంగా బిర్యానీకి మంచి వాసననుమంద, రుచిని జోడించడం కోసం నెయ్యి ఉపయోగిస్తారు.

జంతువుల వ్యర్ధాల నుండి వనస్పతి

బిర్యానీ తయారీకి కూడా నెయ్యిని గాని, నూనెను గాని ఉపయోగిస్తారు. అయితే చాలా చోట్ల బిర్యానీ తయారీకి ఉపయోగించే వనస్పతి జంతువుల వ్యర్థాలతో తయారుచేస్తున్నారు. తాజాగా హనుమకొండ జిల్లాలోని పరకాలలో వందల కిలోల వనస్పతి పట్టు పడడం ఇందుకు ఉదాహరణ. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో జంతువుల వ్యర్థాల నుంచి వనస్పతి తీస్తున్న ముఠాను పరకాల పోలీసులు పట్టుకున్నారు.

పరకాలలో జంతు వ్యర్దాలతో వనస్పతి తయారుచేస్తున్న గ్యాంగ్
హన్మకొండ జిల్లా పరకాల లోని మాచారం కాలనీకి చెందిన మస్తాన్, అంబేద్కర్ రాజంపేట ఏరియాకు చెందిన మెహబూబ్, సలీమ్ లు చాలా కాలంగా జంతువుల వ్యర్థాలతో వనస్పతి తయారు చేస్తున్నారు. వీటిని 15 కిలోల తో కూడిన రేకుల డబ్బాలలో నింపి భద్రపరుస్తున్నారు. ఒక్కో డబ్బాకు 530 రూపాయలు తీసుకుని విక్రయాలు సాగిస్తున్నారు.

జంతు వ్యర్థాల వనస్పతి సీజ్.. వాళ్ళు పోలీసుల అదుపులో
వరంగల్ మండి బజార్ కు చెందిన ఒక వ్యాపారి వారానికి రెండు సార్లు రాత్రి వేళల్లో పరకాలకు వచ్చి వనస్పతిని తీసుకు వెళుతున్నారని, వరంగల్లో ఉన్న బిర్యానీ పాయింట్లు, హోటళ్ళు, రెస్టారెంట్లకు దీనిని అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దాడులు జరిపిన పరకాల పోలీసులు మొత్తం 28 డబ్బాల వనస్పతి ని సీజ్ చేసి తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తెలంగాణా వ్యాప్తంగా బిర్యానీలలో జంతు వ్యర్ధాల వనస్పతి .. జాగ్రత్త
హనుమకొండ, వరంగల్ లో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జంతువుల వ్యర్ధాల తోటి వనస్పతి ని తయారు చేస్తున్నారు. హైదరాబాద్ ముఖ్యంగా బిర్యానీకి ఫేమస్. అటువంటి హైదరాబాద్, తెలంగాణ బిర్యాని ఈ విధంగా జంతువుల వ్యర్ధాలతో కూడిన వనస్పతి తో కల్తీ అవుతుంది అంటే కాస్త ఆలోచించవలసిందే. ప్రతిరోజు బిర్యానీ లేనిదే ముద్ద దిగని వారు వ్యర్థాలతో తయారుచేస్తున్న బిర్యానీలను తింటే అనారోగ్యం పాలు అవుతామనే విషయాన్ని తప్పక గుర్తించాలి.