రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం జనసంచారం అధికంగా ఉండే రహదారులను వేగవంతంగా అభివృద్ధి చేసి చూపించామని, ఇదేవిధంగా రానున్న రోజుల్లో దశలవారీగా అభివృద్ధి ప్రణాళికలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం గురువారం రెండోరోజు స్థానిక 1వ డివిజన్‌లో పండుగ వాతావరణంలో కొనసాగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులకు ప్రజలు, స్థానిక నాయకులు అపూర్వ స్వాగతం పలికారు.
అనంతరం డివిజన్‌లోని ఇంటింటికీ వెళ్ళి తొలిఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించిన ఎమ్మెల్యే చంటి,,, వారి సమస్యలను కూడా తెలుసుకున్నారు. డివిజన్‌లో అపరిష్కృతంగా ఉన్న డ్రైన్, అంతర్గత రోడ్ల సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకురాగా,,, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన,,, శాశ్వత పరిష్కార చర్యలు చేపడతానంటూ వారందరికీ భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. విజనరీ ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో సీఎం చంద్రబాబు చేసిచూపిస్తున్నారన్నారు. అలాగే 1వ డివిజన్‌లో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని, భవిష్యత్తులో వాటన్నింటికీ పరిష్కారమార్గాలు చూపుతానని ఆయన హామీఇచ్చారు.
మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలన్నింటినీ మై టిడిపి యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయడం ద్వారా వాటిని పరిష్కరించేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Social Plugin