Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణలో ఆ 373 రోడ్లకు రిపేర్ షురూ.. ఇక రయ్.. రయ్ మంటూ పరుగులు..!

HYDERABAD:రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా.. మౌలిక సదుపాయాలు పెరగాలన్నా.. పెట్టుబడులు రావాలన్నా.. రోడ్లు, రవాణా సౌకర్యాలు పూర్తి స్థాయిలో మెరుగుపడాలి. ఈ క్రమంలోనే తెలంగాణలో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలోని రహదారులను విస్తరించేందుకు.. మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణలోని 15 జాతీయ రహదారులను రెండు నుంచి నాలుగు లైన్ లుకా మార్చాలని ఇప్పటికే స్పష్టత కొచ్చింది రాష్ట్ర సర్కార్. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్ ) రోడ్ల టెండర్ లకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మొదటి దశలో 5,190 కి.మీ. మేర రోడ్లకు రూ. 6,478 కోట్లతో మరమ్మతులు చేయనుంది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది.

తెలంగాణలో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో మరమ్మతుల కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఫస్ట్​ఫేజ్​లో రాష్ట్రవ్యాప్తంగా 5,190.25 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేయనుంది. దీనికోసం రూ. 6,478.33 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో 373 రోడ్లు ఉండగా 17 ప్యాకేజీలుగా అధికారులు విభజించారు. ఇక ఇప్పటికే ఉన్న 4,840 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. అదనంగా 350 కిలోమీటర్ల రహదారులను రెండు వరుసలుగా విస్తరించనున్నారు.

ఇక హ్యామ్ విధానంలో రోడ్ల మరమ్మతులు సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 3 దశల్లో సుమారు 12 వేల కిలోమీట్లరు రోడ్లను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆగస్టులో మొదటి దశ రోడ్లపై టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం తగ్గుముఖం పట్టాక సెప్టెంబర్ నుంచి పనులు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఫస్ట్ ఫేజ్​పనులకు ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు తెలంగాణలోని రహదారులను విస్తరించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 33, 690 కోట్లతో 1,123 కిలోమీటర్ల మేర రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు 2028 నాటికి పనులు పూర్తి చేయనుంది. ఈ విస్తరణలో జడ్చర్ల- కోదాడ లైన్ మొత్తం 219 కిలోమీటర్లు అతిపెద్ద ప్రాజెక్ట్ గా నిలిచింది. ఈ రోడ్ల విస్తరణ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే రోడ్ల వెంట ఉన్న భూముల ధరలు కూడా పెరగనున్నట్లు తెలుస్తోంది