Hot Posts

6/recent/ticker-posts

కాసేపట్లో నిన్ను చంపేస్తాం.. మళ్ళీ ఎంపీ రఘునందన్ కు బెదిరింపు కాల్స్!


బిజెపి ఎంపీ రఘునందన్ రావు కు మరోమారు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ ఆపాలని, లేదంటే మరికాసేపట్లో ఎంపీ రఘునందన్ రావుని చంపేస్తామని ఆయనను బెదిరిస్తూ వేర్వేరు ఫోన్ నెంబర్ల నుండి కొందరు వ్యక్తులు ఫోన్ చేశారు. ఇప్పటికే రెండురోజుల క్రితం ఆయనకు మధ్యప్రదేశ్ నుండి తాను ఒక మావోయిస్ట్ నంటూ ఒక వ్యక్తి కాల్ చేశారు.సాయంత్రం లోగా నిన్ను లేపేస్తాం దమ్ముంటే కాపాడుకోండి అంటూ సవాల్ విసిరారు.

ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు.. హైదరాబాద్లోనే ఉన్నాం 

ఇక తాజాగా మరోమారు ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయని వారు తెలిపారు. తమ బృందాలు హైదరాబాద్లో మకాం వేశాయని, మరి మరికాసేపట్లో ఎంపీ రఘునందన్ రావు చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దమ్ముంటే కాపాడుకోవాలని సూచించారు. తమ ఫోన్లు ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కానీ తమ సమాచారం దొరకదని చెప్పారు.

రఘునందన్ రావును చంపేస్తామని వార్నింగ్ 

తాము ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రఘునందన్ రావు ని వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. బిజెపి ఎంపీ రఘునందన్ రావుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి సర్జరీ కాగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎంపీ రఘునందన్ రావును హతమారుస్తామని జూన్ 23వ తేదీన తొలిసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.