దారా
స్పెషల్ కరస్పాండెంట్ / జన నిర్ణయం :
Male Female Corn Seed Scam : మేల్ ఫీమేల్ మొక్కజొన్న సాగుచేస్తున్న రైతులతో వ్యాపారం జరుగుతోందా..? ఆయా విత్తనాల కంపెనీల ఆర్గనైజర్లు రైతుల పేరుతో విత్తన మాయాజాలం చేస్తున్నారా..?పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులో మరోకోణం ఏమైనా ఉందా…?అంటే అవుననే అనుమానాలే కలుగుతున్నాయి.
పంట నష్టపరిహారం చెల్లింపులో ఆయా విత్తన కంపెనీల ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు, క్వాలిటీ ఆఫీసర్ల పేరుతో చెలామణీ అయ్యే వారి చీకటి ఒప్పందాలు దర్జాగా అమలు చేస్తున్నట్లు సమాచారం.
హనుమకొండ జిల్లా గూడెప్పాహడ్ సమీపంలోని ఓ పేరొందిన హోటల్ అడ్డాగా మేల్ ఫీమేల్ మొక్కజొన్న పంట సాగుతో నష్టపోయిన రైతులకు గుట్టుగా నష్టపరిహారం చేల్లింపులు జరుగడం బహిరంగ రహస్యమే.
అయితే అడిగిన రైతులకు నష్టపరిహారం చెల్లించడం మంచిదే కానీ అడుగని రైతులు పరిస్థితి ఏమిటనేదే ఇక్కడ ప్రశ్నే. ఈ వ్యవహారంలో టాస్క్ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారిస్తే అసలు స్కాం బయటపడే అవకాశం ఉందనేది గమనార్హ
Male Female Corn Seed Scam : నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టడంతో పలువురు రైతులు నష్టపవడం సర్వసాధారణంగా మారింది.
వ్యవసాయం పైన ఆధారపడి జీవించే రైతన్నకు మోసం చేయడం తెలియదు. తాను పండించే పంట అధిక దిగుబడి రావాలని, ఎంతో కొంత సొమ్ము మిగలాలనే రైతన్న కోరిక.
అలాంటి రైతన్నలు మేల్ ఫీమేల్ మొక్కజొన్న విత్తన కంపెనీలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన నల్లబెల్లి, ఆత్మకూర్, శాయంపేట తదితర మండలాల్లో పదుల సంఖ్యలో వందల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఈ రైతుల్లో కొందరికి ఆ హోటల్ లోని ఓ రూం అడ్డాగా గుట్టుచప్పుడు కాకుండా పరిహారం చెల్లిస్తున్నట్లు సమాచారం. ఒక రకంగా ఈ వ్యవహారం ఆ హోటల్ కు ఉన్న మంచి పేరుకు మచ్చ తెచ్చే అవకాశం లేకపోలేదు.
ఆయా విత్తన కంపెనీల ఆర్గనైజర్లు చెప్పే మాటలను నమ్మిన ఈ రైతులు విత్తనాలు తీసుకొని మేల్ ఫీమేల్ మొక్కజొన్నను సాగు చేశారు. తీరా పంట దిగుబడి వచ్చే సమయానికి ఎకరానికి సరైన విధంగా దిగుబడి రాకపోవటంతో రైతులు లబోదిబోమంటూ విత్తనాలు ఇచ్చిన ఏజెంట్ ను ఒత్తిడి చేయడంతో గుట్టుగా నష్టపరిహారం చెల్లింపులకు సిద్ధపడినట్లు సమాచారం.
Male Female Corn Seed Scam :
అయితే అడిగిన రైతులకు పరిహారం చెల్లిస్తున్న ఆయా కంపెనీల ఆర్గనైజర్లు అడుగని రైతుల నష్టపరిహారాన్ని ఎగనామం పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా అసలు కంపెనీలను నష్టపరిహారం పేరుతో లక్షలు మించిన మాయాజాలంతో గోల్ మాల్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెలల తరబడి ఆ హోటల్ రూంలో మకాం వేయడమే అనుమానాలకు తావిస్తోంది. టాస్క్ఫోర్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే అసలు స్కాం బయటపడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
Social Plugin