Hot Posts

6/recent/ticker-posts

రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు


 విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలతోపాటు ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.


ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అలాగే బాపట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అయితే కృ‌ష్ణాజిల్లాలోని గుడివాడ పట్టణంలో ఇవాళ(బుధవారం) అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కైకలూరు, మచిలీపట్నం 7, ఏలూరు 6, నూజివీడు, భీమడోలు, రేపల్లెలో 5 సెంటీమీటర్లు, లేపాక్షిలో 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.