Hot Posts

6/recent/ticker-posts

ఏలూరు 17,18 తేదీల్లో కొల్లేరులో పర్యటించనున్న సుప్రీం సాధికారితకమిటీ ఏర్పాటులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


 ఏలూరు: కొల్లేరులో వాస్తవ పరిస్థితులు పరిశీలించేందుకు ఈనెల 17,18 తేదీల్లో జిల్లా లో సుప్రీం కోర్ట్ నియమించిన సాధికారీత కమిటీ పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె .వెట్రిసెల్వి తెలిపారు.

 సాధికారిత కమిటీ పర్యటన ఏర్పాట్లు పరిశీలనలో భాగంగా నిడమర్రు మండలం తోకలపల్లి,మండవల్లి మండలం, మణుగూనూరు, పులపర్రు ,కైకలూరు మండలం, ఆటపాక, ఆలపాడు, కొల్లేటికోట ప్రాంతాలలో కలెక్టర్ వెట్రిసెల్వి పర్యటించారు. 

విరితోపాటు కైకలూరు శాసనసభ్యులు Dr. కామినేని శ్రీనివాస్ రావు ఉంగుటూరు శ్యాసన సభ్యులు పత్సమాట్ల ధర్మరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కొల్లేరుకి సమందించిన సుప్రీం కోర్ట్ సాధికారీత కమిటీ ఈ నెల 17, 18 తేదీల్లో కొల్లేరులోని కొన్ని ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నట్లు తెలిపారు. 

మానవీయత కోణంలో కొల్లేరులో ఎన్ని నివాసిత ప్రాంతాలు ఉన్నాయి, జిరాయితీ భూములు, డి.ఫారం పట్టా భూములు ఏమున్నాయి, 2006 సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు ఎలా అమలు చేశారని సంబంధిత నాలుగు అంశాలను కమిటీ పరిశీలించనున్నదన్నారు.

 దీనికి సంబంధించి మంగళ, బుధవారాల్లో సాధికారిక కమిటీ పర్యటించే ప్రాంతాల ప్లాన్ తయారు చేసేందుకు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందన్నారు. రెండు రోజులు పర్యటన అనంతరం బుధవారం ఏలూరు కలెక్టరేట్లో కొల్లేరుకి సంబంధించిన వినతులు స్వీకరించటం జరుగుతుందన్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలోని కొల్లేరు వాసులు కూడా తమ సమస్యలను అందజేయవచ్చు అన్నారు. కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణవేత్తలు కొల్లేరులోని కొన్ని వందల సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ప్రజలు వారి అవసరాలు వారి సమస్యలు జిరాయితీ భూములకు సంబంధించి పరిశీలన కోసం సుప్రీం కోర్ట్ సాధికారిత కమిటీ జిల్లాలో పర్యటించిన ఉందన్నారు. 

కొల్లేరులో వాస్తవ పరిస్థితులు పరిశీలించి మూడు నెలలలో నివేదిక సమర్పించాలని కమిటీని సుప్రీం కోర్ట్ ఆదేశించటం జరిగిందన్నారు. దానిలో భాగంగా సుప్రీంకోర్ట్ లో ప్రభుత్వం తరపున కొంతమంది ప్రైవేట్ రైతుల కూడా అర్జీని పెట్టుకోవడం జరిగిందన్నారు. 

2006లో కొల్లేరులో చేపల చెరువులో కొట్టిన పరిస్థితి, ప్రజల జీవన విధానం వారి ఇబ్బందులను జిరాయితీ భూములు వివరాలను కమిటీ మంగళవారం నిడమర్రు ప్రాంతంలో జిరాయితీ భూములను, బుధవారం కైకలూరు ప్రాంతంలోని ఆటపాక కొల్లేటికోటలో పర్యటించడం జరుగుతుందన్నారు.

 ఈ సందర్భంగా తరతరాల నుంచి జీవిస్తున్న కొల్లేరు ప్రజలు తమ వినుతలను కమిటీకి సమర్పిస్తున్నారు. అనంతరం కమిటీ పైడి చింతపాడు మీదుగా ఏలూరు చేరుకుంటుందన్నారు. అయితే ఈ పర్యటనలో కొన్ని మార్పులు కూడా ఉండవచ్చని వాటిని తెలియజేయడం జరుగుతుందన్నారు. 

ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నియమించిన సాధికారిత కమిటీ మంగళవారం నిడమర్రులో పర్యటిస్తుందని కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలు కొల్లేరు పరిరక్షణ తదితర అంశాలను కమిటీ దృష్టికి ప్రజలు తీసుకొస్తున్నారని అన్నారు. 

కూటమి ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల సంక్షేమాన్ని కూడా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కమిటీ ఏలూరులో సమావేశంలో ఉంగుటూరు నియోజకవర్గంలోని కొల్లేరు ప్రాంత ప్రజలు తమ సమస్యలను తెలియచేస్తారని చెప్పారు. వీరి వెంట ఏలూరు ఆర్డీవో అచ్యుతా అంబరిష్ డీఎఫ్ఓ ( వైల్డ్ లైఫ్) బి విజయ తదితరులు పాల్గొన్నారు.