ANDRAPRADESH, KADAPA: ఎక్కడైనా మజా ఏమి ఉంటుంది అంటే ప్రత్యర్ధి ఇలాకా నుంచి బలంగా రీసౌండ్ చేయడం. ఇపుడు ఆ చాన్స్ టీడీపీకి దక్కుతోంది. అంతే కాదు ఆ పార్టీ రాజకీయ వారసుడు టీడీపీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ కి వరంగా మారుతోంది. నారా లోకేష్ పార్టీపై పట్టును పెంచుకుంటూ ఇపుడు తానే అంతా అన్నట్లుగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన మాటనే పార్టీలో చెల్లుబాటు అవుతోంది అన్నది వాస్తవం. పార్టీలో నామినేటెడ్ పదవుల నుంచి నియామకాలు మార్పులు చేర్పులు అన్నీ లోకేష్ సలహా సంప్రదింపులతోనే జరుగుతున్నాయన్నది చాలా కాలంగా వినిపిస్తున్న టాక్.
అయితే అన్నీ చూస్తున్న లోకేష్ కి ఇపుడు ఎందుకు కొత్తగా కిరీటాలు అన్న చర్చ అయితే రావచ్చు. కానీ పదవులు అందుకోవడంలోనే ఆనందం ఉంటుంది పైగా వాటిని అలకంకరణగా చూడకుండా బాధ్యతగా చూసే లోకేష్ వారికి అవి దక్కింతే ఇంకా పవర్ ఫుల్ గా ఉంటాయని అంటున్నారు.
అందుకే లోకేష్ టీడీపీ జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు అని అంటున్నారు. మరి ఈ పదవికి ఉండే లక్షణాలు అధికారాలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే దాదాపుగా పార్టీకి అన్నీ తానే అన్నట్లుగా లెక్క అని అంటున్నారు.
కేవలం అధ్యక్షుడికి మాట చెప్పి అంతా తానే చూసుకోవడం అన్న మాట. అధ్యక్షుని పేరు మీద అధ్యక్షుని సూచనల మీద వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తారు అన్నది పార్టీ రాజ్యాంగంలో చెప్పుకున్నా అక్కడ ఉన్నది చంద్రబాబు, లోకేష్. దాంతో ఇద్దరూ ఒక్కరే కాబట్టి అంతా లోకేష్ చేతిలోకే వస్తుంది అని అంటున్నారు.
ఆలా లోకేష్ ఇపుడు మహానాడు తరువాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతారు అని అంటున్నారు. అయితే దేనికైనా టైం ప్లేస్ చాలా ముఖ్యమని చెబుతారు. టైం అయితే లోకేష్ కి ఈ కీలక పదవి దక్కడానికి ఇదే కరెక్ట్ అని అంటున్నారు. ఎన్నికలకు చాలా దూరం ఉన్నందువల్ల లోకేష్ కి పగ్గాలు అందితే ఆయన సరైన సమయానికి సంపూర్ణ సారధిగా మారుతారు అని అంటున్నారు.
ఇక ప్లేస్ చూస్తే కడప గడ్డ. అది వైసీపీ అధినేత సొంత జిల్లా. మరి అక్కడే లోకేష్ కొత్త బాధ్యతలు అందుకుంటారు అన్న మాట. ఆ విధంగా ఆయా ప్రత్యర్థికి పెను సవాల్ చేస్తారు అని అంటున్నారు. జగన్ సొంత గడ్డ నుంచే తన రాజకీయ శర సంధానం ప్రారంభిస్తున్నామని ఆయన ధాటీగా చెప్పేందుకే ఈ ప్లేస్ ఎంపిక అంటున్నారు. అంటే ఊరకే కడపలో మహానాడు పెట్టలేదు అన్నది అందరికీ అర్ధం అవుతోంది కదా. దటీజ్ చంద్రబాబు అని కూడా ఇక్కడ చెప్పుకోవాలి.
ఏది ఏమైనా లోకేష్ ఫ్యూచర్ సీఎం. ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ. ఏపీలో ఆయన నవతరం నాయకుడు. అచ్చమైన సీమ బిడ్డ, సీమలో బలంగా ఉందని భావిస్తున్న వైసీపీకి అక్కడే రీ సౌండ్ చేయడం ద్వారా గట్టి బదులు ఇచ్చేందుకే ఈ మహా సమ్రం భం అని అంటున్నారు. సో మహానాడు ఈ సారి మామూలుగా ఉండదంతే అని అంటున్నారు.
Social Plugin