Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో కోవిడ్-19.. ఫస్ట్ కేసు నమోదు.. సర్కార్ కీలక నిర్ణయాలు!


ANDRAPRADESH, VISAKHAPATNAM: కరోనా మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లుంది! ఈ క్రమంలో ఏపీలోనూ మొదలైంది! ఇందులో భాగంగా.. విశాఖపట్నంలోని మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది.


ప్రపంచవ్యాప్తంగా.. ప్రధానంగా దక్షిణాసియా ప్రాంతంలో కరోనా వైరస మళ్లీ విజృంభిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో పలు దేశాల్లోనూ.. భారత్ లోని పలు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి! ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో ఏపీ తాజాగా కరోనా వైరస్ ఫస్ట్ కేసు నమోదైంది. దీంతో.. సర్కార్ మరింత అప్రమత్తమైంది!

కరోనా మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లుంది! ఈ క్రమంలో ఏపీలోనూ మొదలైంది! ఇందులో భాగంగా.. విశాఖపట్నంలోని మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. ఈ శాంపుల్ ను విశాఖ కేజీహెచ్ లోని వైరాలజీ ల్యాబ్ లోనూ పరీక్షించగా.. కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు వైద్యులు.

ఈ నేపథ్యంలో ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అయితే.. మిగిలిన ముగ్గురికీ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో.. ఆ మహిళను వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.

దీంతో... ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా.. కాకినాడ జీజీహెచ్ లోనూ కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 24 బెడ్ లతో జీజీహెచ్ లో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెయ్యికి పైగా కోవిడ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు.

కాగా... కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే బిగ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ సమయంలో.. ఎవరికైనా జ్వరం, దగ్గు, నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది.

ఇదే సమయంలో... ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర గెట్ టుగెథర్ లు వాయిదా వేసుకోవాలని.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్ట్ వంటి చోట్ల కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్బిణీ స్త్రీలు వీలైనంత వరకూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది! ప్రతీ ఒక్కరూ మాస్క్ లు ధరించాలని కోరింది.