శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ గారు శుక్రవారం ప్రకటించిన నూతన రాష్ట్ర కమిటీలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన చౌదరి) గారిని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు కొవ్వలిలోని చౌదరి గారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
పుష్ప గుఛ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు గారపాటి చౌదరి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని, ఆయన సేవలను గుర్తించి బీజేపీ ఈ పదవిని కేటాయించడం హర్షించదగ్గ విషయం అని అన్నారు.
రెడ్డి అప్పల నాయుడు గారితో పాటు నగర అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, చిట్టిబొమ్మ రమేష్ ఇతర నాయకులు గారపాటి చౌదరి గారికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఆయన మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Social Plugin