Hot Posts

6/recent/ticker-posts

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏపీలో ఆ రైల్వే స్టేషన్లో స్లీపింగ్ ప్యాడ్స్!


ANDHRAPRADESH:భారతీయ రైల్వే ఆధునికతకు అద్దం పడుతూ, ప్రయాణికుల మౌలిక వసతుల కల్పనకు అనేక విధాలుగా కృషి చేస్తోంది. ఇప్పటికే రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులను చేస్తున్న రైల్వే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఆధునీకరిస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ టికెట్ల రూపంలోనే కాకుండా ఇతర సదుపాయాల ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తున్న రైల్వే స్లీపింగ్ పాడ్స్ ద్వారా ప్రయాణికులకు కొత్త సౌకర్యాన్ని కల్పిస్తోంది.

విశాఖలో అందుబాటులోకి స్లీపింగ్ ప్యాడ్స్ 

రైల్వే స్టేషన్లలో అందుబాటు ధరలలో ప్రయాణికులు బస చేయడానికి వీలుగా వీటిని దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే. ముంబై ,హైదరాబాద్ స్టేషన్లకు పరిమితమైన ఈ స్లీపింగ్ ప్యాడ్స్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఆధునిక వసతులతో స్లీపింగ్ ప్యాడ్స్ 

సెంట్రల్ ఏసీ తో మహిళలకు, పురుషులకు వేరువేరు వసతులతో, వేడి నీళ్లు, వైఫై సదుపాయాలతో ఈ స్లీపింగ్ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆధునిక వసతులతో ఏర్పాటుచేసిన ఈ స్లీపింగ్ ప్యాడ్స్ రైళ్లలో ప్రయాణాలు చేసే ప్రయాణికులు, ఒకవేళ అక్కడ బస చేయాలనుకుంటే తక్కువ ధరలకు బసచేసే వీలును కల్పిస్తున్నాయి. తక్కువ స్పేస్ లో సౌకర్యవంతంగా ఉండే ఈ స్లీపింగ్ పాడ్స్ ఉండే హోటల్స్ ను క్యాప్సూల్ హోటల్స్ అంటారు.

తూర్పు కోస్తా రైల్వే జోన్ లో తొలిసారి స్లీపింగ్ ప్యాడ్స్

ఈ వ్యవస్థ మొదట జపాన్ లో ప్రారంభమై ఇప్పుడు క్రమంగా ప్రపంచమంతటా విస్తరిస్తోంది. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో తొలిసారి ఈ రకమైన వసతిని ఏర్పాటు చేయడం ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. విశాఖ రైల్వేస్టేషన్లోని ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఒకటవ అంతస్తుపై ఈ స్లీపింగ్ ప్యాడ్ లు అందుబాటులో ఉన్నాయి.

ప్రయాణికులకు కంఫర్ట్ ఇస్తూ స్లీపింగ్ ప్యాడ్స్ 

రెండు గంటలకు 200 రూపాయలు, ఒకవేళ ఒక రోజంతా ఉంటే 400 రూపాయలు దీనికి చార్జ్ చేస్తారు. మొత్తంగా విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ స్లీపింగ్ ప్యాడ్స్ ప్రయాణికులకు మంచి కంఫర్ట్ ను ఇస్తూ, వారి గోప్యతకు భంగం కలగకుండా అన్ని వసతులతోను ఏర్పాటు చేయబడింది.