తాజాగా మహేంద్రా గ్రూప్ సంస్థ.. ఒక ప్రకటనను తెలుగులో రూపొందించింది. ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండంటూ ఒక యాడ్‌ను తయారు చేసింది. ఈ యాడ్‌ను ఆ సంస్థ చైర్మన్ ఆనంద్ మహింద్రా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
ఏ భాషలో అయినా మాట్లాడండి.. ఏ దుస్తులైనా ధరించండి.. ఏ ఆహారమైన తీసుకొండి.. ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రండి ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుందామని ఆయన పిలుపు నిచ్చారు. తన ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి నారా లోకేష్ ఆదివారం స్పందించారు.
తాజాగా మహేంద్రా గ్రూప్ సంస్థ.. ఒక ప్రకటనను తెలుగులో రూపొందించింది. ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండంటూ ఒక యాడ్‌ను తయారు చేసింది. ఈ యాడ్‌ను ఆ సంస్థ చైర్మన్ ఆనంద్ మహింద్రా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి నారా లోకేష్.. ఈ యాడ్‌పై స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరిష్టమైన విధానాలతో వ్యాపార వాతావరణం అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మహేంద్ర గ్రూప్ సంస్థను ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు.
తమ రాష్ట్రంలో.. మీరు పెట్టుబడులు పెట్టాలను కోవడాన్ని తాము చాలా విలువైన అంశంగా పరిగణిస్తున్నామన్నారు. అదీకాక మీ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరో స్పెస్ తయారీ రంగాన్ని విస్తరించాలనుకుంటున్నట్లు తాను తెలుసుకున్నాని ఈ సందర్భంగా నారా లోకేష్ వివరించారు. ఇక మీ యాడ్ సైతం తన మనస్సును కట్టిపడేసిందన్నారు.
రాష్ట్రంలో మీ వాహనాలకు పెద్ద మార్కెట్ ఉందన్నారు. సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌లో మీ తయారీ సంస్థ ఏర్పాటును తాము పరిగణలోకి తీసుకుంటామన్నారు. మీ బృందానికి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను.. అలాగే ఇక్కడ అందుబాటులో ఉన్న సమృద్ధి అవకాశాలను ప్రదర్శించాలనుకుంటున్నానని ఆనంద్ మహేంద్రకు నారా లోకేష్ తెలిపారు.
బెంగళూరు ఎయిర్ పోర్ట్ వద్ద ఏర్పో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించుకుందంటూ ఈ వారం ప్రారంభంలో వార్తలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు.
బెంగళూరులో ఏరో స్పేస్‌లో పెట్టాలనుకున్న పెట్టుబడుదారులకు ఆయన కీలక సూచన చేశారు. మీ కోసం నా వద్ద మంచి ఆలోచన ఉందన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు దృష్టి కేంద్రీకరించకూడదని ప్రశ్నించారు. అత్యుత్తమ ప్రోత్సాహకాలతోపాటు వేలాది ఎకరాల భూమిని మీ కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు త్వరలో మిమ్మల్ని కలిసి మాట్లాడాలని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్విట్ చేశారు.
Social Plugin