ఈ సందర్భంగా MP పుట్టామహేష్ మాట్లాడుతు ప్రజల అర్జీరూపంలో తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నానని మిగిలిన సమస్యలు భూ వివాదాలకు సంబంధించిన అంశాలు కావడంతో జాప్యం జరుగుతుందని తెలియజేశారు.
పార్లమెంట్ సమావేశాలలో అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల కోసం ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో తన కార్యాలయంలో నేరుగా ప్రజా సమస్యల వినతలను తీసుకునేందుకు విభాగాన్ని ఏర్పాటుచేశామని MP పుట్టా మహేష్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
ప్రజలకు ఎప్పుడు సేవకులమని ప్రజా సమస్యలు నెరవేర్చడానికి తన రాజకీయాల్లోకి వచ్చానని ప్రజలనమ్మకాన్ని ఓమ్ము చేయకుండా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు MP తెలిపారు.
ఎంపీగా పార్లమెంట్ సమావేశంలో తొలిఅడుగు పెట్టిన ఏడాదికాలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమం చేసేందుకు నేనెప్పుడూ ప్రజల కోసం శ్రమిస్తాను అని MP తెలియజేశారు.
పార్లమెంట్ పరిధిలో పామాయిల్ రైతులు ఎంపీ మహేష్ కుమార్ ను కలిసి తమసమస్యలు విన్నవించుకున్నారు. పామాయిల్ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తా అని రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు
Social Plugin