ఏలూరు : కొల్లేరు ప్రాంత సమస్యలపై రెండు రోజులు అధ్యయనం అనంతరం నిర్ధేశించిన కాలపరిమితిలోపు నివేదికను సుప్రీంకోర్టు కు సమర్పిస్తామని సీఈసీ సభ్యులు చంద్రశేఖర గోయల్ వెల్లడించారు.
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించివున్న కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజల సమస్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేసేందుకు గోయల్ నేతృత్వంలో బృందం మంగళవారం జిల్లా కు చేరుకుంది.
ఏలూరు జిల్లాలోని కొల్లేరు గ్రామాల పర్యటన అనంతరం ఏలూరులో రాత్రి మీడియా సమావేశంలో గోయల్ మాట్లాడారు ఎన్నో దశాబ్దాలుగా కొల్లేరు సరస్సు వుందని ఆయన అన్నారు. అలాగే ఆ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయన్నారు.
1999లో కొల్లేరు పరిరక్షణ అంశం నోటిఫై చేశారన్నారు. కొల్లేరు విషయంలో రీమార్కేషన్, సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిందన్నారు. ఈ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగినప్పటికీ ఇంకా పరిష్కారం కాని అంశాలు వున్నాయని గోయల్ చెప్పారు .
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు దృష్టికి వచ్చిన అంశాలపై నివేదిక ఇవ్వాలని తమ కమీటీని నియమించిందన్నారు. ఆ దిశగా తొలిరోజు తాము ఏలూరు జిల్లా పరిధిలోని కొల్లేరు గ్రామాల ల్లో పర్యటించామన్నారు.
అక్కడ వాస్తవ పరిస్థితి, ప్రజలతో ముఖాముఖి మాట్లాడడం, తమకు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పరిశీలించామని వివరించారు. తొలి రోజు పర్యటన తమ పరిశీలన లో ముందడుగు అన్నారు. తాము స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తో, మంత్రితో భేటీ అయ్యామని చెప్పారు.
తమతోపాటు అటవీ పర్యావరణ పరిరక్షణ అధికారులు, వైల్డ్ల్ లైఫ్ ఛీఫ్ వార్డెన్ జిల్లా కలెక్టర్, ఈ పర్యటనలో తమ వెంటవుండి కొల్లేరుకు సంబంధించిన భౌగోళిక స్వరూపం వివరించారని గోయల్ చెప్పారు.
బుధవారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా అధికారులుతో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ రెండు రోజుల పర్యటన అనంతరం తాము గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో సుప్రీంకోర్టు కు సమర్పిస్తామని వెల్లడించారు.
ఈ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తమకు 12 వారాల గడువు ఇచ్చిందన్నారు. ఈ విషయం సుప్రీం పరిశీలన లో వున్నందున ఈ దశలో తామేమి ఆయా అంశాలపై వ్యాఖ్యానించడం లేదన్నారు.
సమావేశంలో కమిటీ మెంబరు కార్యదర్శులు డా.జె.ఆర్. భట్, జి. భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్రభట్ లతో పాటు అటవీశాఖ ప్రన్సిపల్ ఛీఫ్ కన్సర్వేటర్ అజేయ్ కుమార్ నాయక్, మత్స్యశాఖ కమీషనరు రమాశంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్,
పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్, కైకలూరు శాసన సభ్యులు డా. కామినేని శ్రీనివాస్, ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజు, తదితరులు ఉన్నారు
Social Plugin