ANDRAPRADESH: ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. రేషన్ డోర్ డెలివరీ కోసం ఉద్దేశిం చిన వాహనాలు.. నాటి ప్రభుత్వంలో రేషన్ బియ్యాన్ని మాఫియాకు డెలివరీ చేసిందని సీరియస్ అయ్యా రు.
వైసీపీ హయాంలో తీసుకువచ్చిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలను జూన్ 1వతేదీ నుంచి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ఒకటి అరా మాత్రమే అందుబాటులో ఉంచనుంది. మిగిలిన 1600 వాహనాలను కూడా కూటమి సర్కారు నిలుపుదల చేసింది. తద్వారా.. రేషన్ సరుకులను మరింత పారదర్శకంగా ప్రజలకు(లబ్ధిదారులు) అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే.. ఈ వ్యవహారంపై వైసీపీ విమర్శలు గుప్పించింది.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. రేషన్ డోర్ డెలివరీ కోసం ఉద్దేశిం చిన వాహనాలు.. నాటి ప్రభుత్వంలో రేషన్ బియ్యాన్ని మాఫియాకు డెలివరీ చేసిందని సీరియస్ అయ్యా రు. తాము ఈ వాహనాలపై అనేక రూపాల్లో సర్వే చేయించామన్నారు. అయితే.. ఏ ఒక్క విషయంలోనూ ప్రజల నుంచి పాజిటివ్ టాక్ రాలేదని చెప్పారు. 1600 వాహనాల్లో ఒక్కటి కూడా.. ఏనాడూ ప్రజల గుమ్మం ముందుకు వెళ్లి బియ్యం ఇవ్వలేదని చెప్పారు.
ఈ క్రమంలో ఆయా వాహనాలను రద్దు చేయడానికి నాలుగు కారణాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ వివరించారు. 1) ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల్సిన వాహనాలను నాలుగు రోడ్ల జంక్షన్లలో నిలిపి పంపిణీ చేశారు. 2) వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక లబ్దిదారులు రోజువారీ పనులు మానుకుని ఎదురు చూశారు. 3) రేషన్ బియ్యం, సరకులను అక్రమంగా తరలిస్తున్నారు. 4) వేలాది టన్నుల బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టులకు అక్రమంగా తరలించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడ్డాయి. అని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని తిరిగి జూన్ 1 నుంచి రేషన్ దుకాణాలకే అప్పగించామన్నారు. ప్రతి నెలా 1-15వ తేదీ వరకు ఉదయం 8గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 8గంటల వరకు దుకాణాల ద్వారా పేదలు రేషన్ సరుకులు తెచ్చుకోవచ్చని తెలిపారు. ఎక్కడ , ఏ దుకాణంలో అయినా లబ్దిదారులు సరుకులు తీసుకోవచ్చని చెప్పారు.
Social Plugin