ఇంత జరుగుతున్న మైనింగ్ అధికారుల జాడ ఎక్కడ??
వివరాల్లోకి వెళితే...
ముదినేపల్లి మండలం పెదగొన్నూరు గ్రామ పరిధిలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా చెరువు తవ్వకాల పేరుతో విచ్చలవిడిగా మైనింగ్ తరలిస్తు కాసులు దండుకుంటున్న మైనింగ్ మాఫియా.
పచ్చటి పంట పొలాలను సైతం ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అమ్మకాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు... ఇదేమిటి అని ప్రశ్నించిన వారిని పార్టీ పేరు చెప్పి భయబ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న..చోటా బాబులు మండలంలో ములకలపల్లి, ప్రొద్దువాక, ఊటుకూరు మరియు పెదగొన్నూరు గ్రామాలలో విచ్చలవిడిగా మట్టి తోలకాలు జరుపుతున్నారు .
అనుమతులు లేకపోయినా ఉన్నాయంటూ.. అధిక లోడుతో మట్టి రవాణా చేస్తూ ట్రక్కు మట్టి భారీ ధరలకు అమ్మకాలు జరుపుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న మైనింగ్ మాఫియా
పెద్దగొన్నూరు గ్రామంలో ద్విచక్ర వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైనింగ్ మాఫియా.. రై... రైమంటూ ఓవర్ లోడుతో మట్టి తోలకాలు రోడ్డుపై మట్టి దిమ్మలు, పెల్లలు పడిన లెక్కచేయకుండా విపరీతమైన వేగంతో దూసుకెళ్తున్న మట్టి ట్రాక్టర్లు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్న మైనింగ్ మాఫియా.. మండలంలో అధికారులు అక్రమ మైనింగ్ ని అడ్డుకుంటారో.. లేదో.. వేచి చూడాలి

Social Plugin