Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణలోని రైతులకు మరో శుభవార్త.. ఇలా చేస్తే డబ్బులే డబ్బులు


HYDERABAD:తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఒక్కో పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది రేవంత్ సర్కార్. ఇటీవల పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా పథకం నిధుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం రికార్డు వ్యవధిలో విజయవంతంగా పూర్తిచేసింది. మొత్తం 69.39 లక్షల మంది రైతులకు గాను రూ.8,744.13 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది రేవంత్ సర్కార్. తాజాగా రైతులు మరింత అభివృద్ధి చెందేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది

రైతుల ఆదాయం పెరిగే విధంగా రాష్ట్రంలో ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అమలు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధానం ద్వారా చెట్లు, వ్యవసాయ పంటలను ఒకే భూమిలో పెంచుతారు. అంటే వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకాన్ని చేపడతారు. ఈ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఆగ్రో ఫారెస్ట్రీ విధానం ద్వారా ఓ వైపు రైతులకు పంట ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అడవుల విస్తీర్ణ పెంచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విధాయం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు దేశంలో వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ కాపీ రూల్స్ ను ఇటీవల జారీ చేసింది.

వ్యవసాయ భూముల్లో అటవీ ఉత్పత్తులను పెంచాలనుకునే రైతులు ముందుగా నేషనల్‌ టింబర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్ లో పేర్లు నమోదు చేసుకోవాలి. వ్యవసాయ భూమిలో ఎలాంటి మొక్కలు పెంచుతారో చెప్పాలి. వ్యవసాయ భూముల్లో ఇదివరకే ఉన్న చెట్లను నరికివేయాలను కుంటే అవి 10కి మించి ఉంటే వెంటనే నేషనల్‌ టింబర్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్‌ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చెట్ల ద్వారా రైతులు అదనంగా ఆదాయం సమకూర్చుకోవచ్చు.

మరోవైపు "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా" పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు సాయం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. అలాగే కౌలు రైతులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో తెలిపిన విషయం తెలిసిందే.

అంతేకాక రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిందిరాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని వ్యవసాయ బోర్లకూ సోలార్ ప్లేట్స్ ను ఏర్పాటు చేయనుంది. దీంతో ఆ కరెంట్ ను బోరుకు వినియోగించుకోవచ్చు. మిగిలిన సోలార్ కరెంట్ గ్రిడ్ కు సరఫరా అవుతుంది. సోలార్ విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేసినందుకు రైతుకు ఒక యూనిట్ కు రూ. 3.13 చొప్పున డిస్కమ్ సంస్థలు చెల్లిస్తాయి. దీంతో రైతులు పంటల ద్వారానే కాకుండా అదనంగా కూడా సంపాదించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.